ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన పించా ప్రాజెక్టులోకి వరుసగా నీరు చేరుతోంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకోవడంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. Inflow–Outflow 376 క్యూసెక్కులు, నీటి మట్టం 1000.00 అడుగులు, ప్రాజెక్టు సామర్థ్యం 327.60 MCFT గా నమోదైంది.ఎఈఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బి. నాగేంద్ర నాయక్ తెలిపారు: డ్యాం గేట్లు తెరవడంతో దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈత కొట్టడం, మోటార్ వినియోగించడం, పశువులు మేపడం వంటివి పూర్తిగా నివారించాలని హెచ్చరించారు.