ప్రకాశం జిల్లా ఒంగోలు డిఎస్పీ కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఆదివారం ఉదయం 45వ డివిజన్ మారుతీ నగర్ గణేష్ విగ్రహ నిమజ్జన సమయంలో పోలీసు నిబంధనలను ఉల్లంఘించి పోలీసులపై దాడికి పూనుకున్న యువకులపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు దీనిని నిరసిస్తూ వైసిపి ఒంగోలు నియోజక వర్గ ఇన్చార్జి చుండు రవి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు డిఎస్పి కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టారు దీంతో డిఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి