మురమళ్ళ నుండి కాట్రేనికోన వస్తున్న 20 టన్నుల లారీ వంతెన సమీపంలో అదుపు తప్పి దిగబడి పోయింది. లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం తో పెను ప్రమాదం తప్పింది. మురమళ్ళ వద్ద ఏర్పాటు చేసిన గడ్డర్ తొలగింపు భారీ వాహనాలు ఏటి గట్టుపై వస్తున్నాయని దీంతో ఏటి గట్టు దిగబడి పోతుందని దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు డిమాండ్ చేశారు.