రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏపీ స్టేట్ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ల పేర్లను సోమవారం వెలువడించింది. అందులో నంద్యాల జిల్లా బనగానపల్లె చెందిన టిడిపి పట్టణ అధ్యక్షులు దూదేకుల కాశీం బాబు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఈ పదవి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అని తెలిపారు అలాగే దూదేకుల కొరకు దూదేకుల సమస్యల కొరకు ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు