గద్వాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన టీచర్ల అవార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాఠశాల విద్యాశాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవంలో రభస జరగడంపై విద్యాభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.