ఉరవకొండ మండలం రాంపురం గ్రామానికి చెందిన రమేష్( 33)గురువారం గుత్తిలోని ఎస్సీ కాలనీలో అత్తారింటికి వచ్చాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రమేష్ ను మొదట గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు కర్నూలు రెఫర్ చేశారు. కర్నూల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.