కూటమి ప్రభుత్వం సమగ్రమైన అభివృద్ధికి సాంఘిక భద్రతకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని అఖిలభారత ఓ బి సి సంఘం జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం విజయవాడ గాంధీనగర్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు బీసీ బీసీల సామాజిక రక్షణ చట్టాన్ని రక్షణ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మంత్రి మండల సమావేశంలో బీసీ సామాజిక రక్షణ చట్టాన్ని అటువంటి చంద్రబాబు విధాన ప్రకటన చేయాలని కోరారు. బీసీ రక్షణ చట్టం ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాల నుండి బీసీలకు మినహాయింపు ఇవ్వాలని అన్నారు.