రాజమండ్రిలోని 43 మరియు 44 డివిజన్లో జరుగుతున్న పరిశుద్ధ నిర్వహణపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరగని వార్డులపై ప్రత్యేక దృష్టి కట్టాలని సిబ్బందికి సూచించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. అలాగే నగర ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని సూచించారు.