జనగామ జిల్లా కేంద్రంలో బంజారా ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించిన తీజ్ నవరాత్రి వేడుకలు ఆదివారంతో ఘనంగా ముగిస్తాయి.సంత శ్రీ సేవాలాల్ మహారాజ్,మేరమా యాడి, జగదంబ మాత ఆశీస్సులతో ఘనంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో బంజారా పెద్దలు యువత యువకులు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారా జాతి ముఖ్య నాయకులు మాట్లాడుతూ తరతరాలుగా బంజారా లు అడవి జీవన విధానంలో అలవాటు పడి ప్రకృతిని ఆరాధనగా భావిస్తూ జీవనం కొనసాగిస్తున్నారని సకల సంపదల మూలమే ప్రకృతి అని చాటి చెప్పే ఈ తీజ్ పండుగ బంజారాల ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.