నల్లగొండ జిల్లా: సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు వాడినట్లయితే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ లు సంయుక్తంగా శనివారం హెచ్చరించారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ హైదరాబాద్ విజయవాడ రహదారిపై వెలిబినేడి వద్ద ఉన్న యాడ్లు డిఐఎఫ్ సెల్ కౌంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు మాత్రమే వాడాలని అలా కాకుండా ఇతర పనులకు వాడవద్దని ఇండస్ట్రీలకు ఇండస్ట్రీ యూరియాని వాడాలని అన్నారు.