నవరాత్రి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని జనగం డిసిపి రాజమహేంద్ర నాయక్ సూచించారు. జనగామ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డలో ఏర్పాటుచేసిన గణేష్ మంటపాన్ని డిసిపి రాజమహేంద్ర నాయక్ సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొన్న పిల్లలకు డిసిపి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా డిసిపిని ఉత్సవ కమిటీ సభ్యులు శాలువతో సత్కరించి వెంకటేశ్వర్ల స్వామి ఫోటోను జ్ఞాపికగా అందజేశారు.