ఆలూరులోని హత్తిబెళగల్ రోడ్డులో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం పైకప్పు పెచ్చులూడి విద్యార్థికి గాయాలయ్యాయి. నూతనంగా భవన నిర్మాణ మరమ్మతులు చేపట్టారు. అయితే పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థిని తలపై పడడంతో గాయాలయ్యాయి. విద్యార్థినిని వెంటనే ఉపాధ్యా యులు, స్థానికులు కలిసి ఆసుపత్రికి తరలించారు.