ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 21 మందికి 8,94,513 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఆపదలో అండగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయనిదే అని ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయాన్ని మరవకూడదని తెలిపారు.