గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికుల సమ్మె శనివారం రెండో రోజుకు చేరింది. 7 నెలలుగా వేతనాలు రావడం లేదని CITU జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమ చారి తెలిపారు. ఉన్నతాధికారులకు తమ సమస్యను పలుమార్లు తెలియజేసినా ఫలితం లేకపోవడంతో సమ్మెకు దిగినట్లు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.