కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ మంగళవారం 3 గంటలకి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..బిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత ను పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సప్పెంచ్ చేయడాన్ని మేము స్వాగతిస్తామని అన్నారు. ఎవరైనా పార్టీకి లోబడి పని చేయాలని, గత కొంత కాలంగా కవిత పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యకలాపాలకు ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు. పార్టీలో ఎంత పెద్ద వారైనా, కుటుంబ సభ్యులైన సమానమే అని పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలే ముఖ్యమని పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కూతురుకు కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు.