తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ శివారులో ఉన్నటువంటి కాగితాల పురం హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలైన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే కాగితాల పురం లో ఆదివారం రాత్రి జాతర మహోత్సవం జరుగుతుండగా శంకర్ అనే వ్యక్తి రోడ్డు పక్కగా నిలబడి ఉండడంతో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయిందని అక్కడ స్థానికులు తెలిపారు అనంతరం చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రి తరలించగా అతని కాలు విరిగిందని వైద్యులు తెలిపారు మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించమని వైద్యులు సూచించారు