మదర్ థెరిస్సా 115వ జయంతి వేడుకలు నరసరావుపేటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పల్నాడు రోడ్లోని మదర్ థెరిస్సా విగ్రహానికి మంగళవారం సాయంత్రం 5గంటలకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పూలమాలు వేసి నివాళులర్పించారు. మదర్ థెరిస్సా చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. మదర్ థెరిస్సా మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ పేదవారికి సేవ చేస్తూ ఉండాలన్నారు.