చిత్తూరు: అన్నదాత పోరు పోస్టర్ల ఆవిష్కరణ యూరియా కొరతపై రైతులకు అండగా ఉండేందుకు ఈనెల తొమ్మిదిన వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి విజయానంద రెడ్డి ఆదివారం తెలిపారు. గంగినేని చెరువు నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు రైతులతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందించనున్నట్లు వెల్లడించారు. సంబంధిత పోస్టర్లు ఆవిష్కరించారు. రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు.