ములుగు జిల్లా రైతులకు యూరియా విషయంలో ఆందోళన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేశ్ కుమార్ నేడు మంగళవారం రోజున సాయంత్రం 5 గంటలకు తెలిపారు. జిల్లాకు ఈనెల 27న 500 మెట్రిక్ టన్నులు, 31న మరో 500 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందన్నారు. జిల్లాలో రైతులకు కావాల్సిన 4వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం 10వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, ఈ సంవత్సరం 10,720 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు.