యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని 7 14 17 18 వ వార్డులో నెలకొన్న వీధి కుక్కల బెడద నివారణకు గురువారం మున్సిపల్ అధికారులు చర్యలను చేపట్టారు చౌటుప్పల్ లోని వివిధ వార్డులో ఉన్న కుక్కల బెడద కారణంగా మున్సిపల్ కమిషనర్ వెంకట్రాంరెడ్డి ఆదేశంతో గురువారం స్వతంత్ర ఎనిమల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 29 కుక్కలను పట్టుకుని వాటికి స్టెబిలైజేషన్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు .వాక్సినేషన్ చేసిన తర్వాత వాటిని మళ్లీ వదిలిపెడతామని తెలిపారు. పట్టణ ప్రజలు వీధి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని కమిషనర్ సూచించారు.