ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు జంక్షన్ వద్ద అన్నదాత పోరు కార్యక్రమానికి వైసీపీ నాయకులు వైసిపి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఒకవైపు మార్కాపురం కార్యక్రమానికి అనుమతులు లేవంటూ పోలీసులు తెలిపినప్పటికీ వైసీపీ నేతలు కార్యకర్తలు వెనకకు తగ్గలేదు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్థానికంగా ఉన్న వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని వైసిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.