ఉయ్యూరులో విజిలెన్స్ డి.ఎస్.పి బంగారు రాజు బృందం ఆధ్వర్యంలో ఎరువులు షాపులు తనిఖీలు నిర్వహించారు.పలు దుకాణాలు తనిఖీలు చేసి, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించిన డి.ఎస్.పి. లైసెన్స్ లేకుండా గోడౌన్ నిర్వహించి స్టాక్ నిర్వహిస్తే, తప్పక చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. లైసెన్స్ లేకుండా నడిపే వ్యాపారాలపై సంబంధిత సమాచారం పోలీస్, రెవిన్యూ, విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.