కలికిరి మండలం కలికిరి పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల డిగ్రీ కళాశాలలో నేత్రధానం పై విద్యార్థినులకు మేడికుర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ కావ్య గంధ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డాక్టర్ అంజలీ దేవి అధ్యక్షతన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ సోమవారం అవగాహన కల్పించారు. జాతీయ నేత్రధాన పక్షోత్సవాలు ఆగష్టు 25నుండి సెప్టెంబర్ 8 వరకు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా డి. ఎమ్. హెచ్. ఓ ఆదేశాల మేరకు జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నేత్రధానం యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత, ఎవరు నేత్రధానం చేయవచ్చు అనే విషయాలు పై అవగాహన కల్పించారు