ఆదిలాబాద్ జిల్లా ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో డబ్బులు అడిగితే నేరుగా తనకే ఫోన్ చేయాలని చెప్పిన మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. బోథ్ మండల కేంద్రంలో తన నెంబర్ ను నేరుగా ప్రజలకు ఇచ్చారు మంత్రి..పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేసే మంత్రి మాట్లాడారు..ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్దిదారులను..అధికారులు, ప్రజాప్రతినిధులు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు..ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు బోథ్ మండల కేంద్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు