ఆత్మహత్యతో మీ సమస్యలను పరిష్కరించుకోలేరని, ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబం ఒంటరిగా మిగిలిపోతుందని ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చిన్న చిన్న విషయాలకు క్షణిక ఆవేశంలో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఒక్క క్షణం తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదన్నారు. గ్రామంలో అవగానహ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.