నక్కవారిపాలెం పెద్ద ఏర్పాటు చేసిన కోటిలింగాల మహాగణపతి ఆలయంలో దర్శనాలు నిలిపివేయడంతో వ్యాపారస్తులు, వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన లంబది రా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చిన్నారి సాహితీని అడ్డుపెట్టుకొని వెనుక నుండి కొంతమంది నడిపిస్తున్నారని ఆరోపించారు. లంచాలు ఇవ్వలేదని ఫిర్యాదులు చేయిస్తూ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులు మాట్లాడుతూ ట్రస్ట్ నిర్వాహకులు ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే స్టాల్స్కు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్శనం నిలిపివేతతో అక్కడ పరిస్థితి వివాదాస్పదంగా మారింది.