నిర్మల్ జిల్లా కేంద్రంలో రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి 156వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక వెంకటాపూర్ రోడ్డు లోని ఆయన విగ్రహానికి రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి సొసైటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంతంలో విద్య అవకాశాలు లేని సమయంలో విద్యా సంస్థలు, వసతి గృహాలను స్థాపించి ఎంతో మందికి విద్యను అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రాజబహదూర్ వెంకట్‌రామిరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు. పోతారెడ్డి, దామోదర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, లింగా రెడ్డి, అశోక్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి