విశాఖ నగరంలోని బాలుర ప్రత్యేక వసతి గృహాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 60 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ భవనంలో ఆరు జిల్లాలకు సంబంధించిన వివిధ నేరాల కింద వచ్చిన బాలురను ఉంచి వారికి ప్రత్యేక విద్యాబుద్ధులు నేర్పిస్తామని తెలిపారు అలాగే సమాజంలో ఎలా మెలగాలి అనే అంశాన్ని తెలియజేస్తామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిపి ఆమె కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడారు.