Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 21, 2025
ప్రస్తుతం వర్షాకాలం కారణంగా చెరువులు, వాగులు, వంతెనలు మరియు ఇతర జలమార్గాలు నిండిపోతున్నాయి. నీటి ప్రవాహం బలంగా ఉండటం వల్ల చేపల వేటకు వెళ్ళడం ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. గత సంవత్సరాలలో వర్షాకాలంలో చేపలు పట్టడానికి వెళ్లి, మునిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి కాబట్టి అందువల్ల – 1. మత్స్యకారులు వర్షాకాలం పూర్తయ్యే వరకు చేపలు పట్టడానికి ప్రయత్నించరాదు. 2. చెరువులు, వాగులు, కాలువలలో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు దిగి వేట చేయడం పూర్తిగా నిషేధం. 3. తమ కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.