కల్లూరు అర్బన్ పరిధి,32వ వార్డ్, ప్రాంతం హంద్రీ నదిలో పెరిగిన ముళ్ల చెట్లను తొలగించాలని KVPS 32వ వార్డ్ అధ్యక్షులు రామాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు.మంగళవారం KVPS ఆధ్వర్యంలో హంద్రీని పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హంద్రీ నదిలో పూర్తి స్థాయిలో ముళ్ల చెట్లు పెరిగి అసాంఘీక కార్యక్రమాలకు నెలవుగా మారిందన్నారు. మరోవైపు స్థానిక ప్రజల ఇళ్లల్లోకి పాములు,తేళ్లు వంటి విషపురుగులు సంచరించడం జరుగుతుంది... ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో KVPS 32వ వార్డ్ కార్యదర్శి సురేష్, నాయకులు వెంకటేష్,చిట్టిబాబు,రాజు, వెంకట్,సూరి పాల్గొన్నారు.