తిర్యాణి మండలం పంగిడి మదర ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదుతున్న ఆత్రం అనురాగ్ డెంగీతో చికిత్స పొందుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందినట్లు DTDO రమాదేవి తెలిపారు.. విద్యార్థి జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని పాఠశాల HM సాగర్ను సస్పెండ్ చేశారు. ANM సువర్ణను టెర్మినేట్ చేసినట్లు DTDO రమాదేవి తెలిపారు.