రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, లలిత సహస్రనామ పఠనం జరిగింది. మహిళా భక్తులు దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు.