కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామ రైల్వే వంతెన క్రిందికి భారీగా వర్షం నీరు చేరి ఆ వర్షపు నీరులో కారు చిక్కుకుపోయింది. దీంతో ట్రాక్టర్ సహాయంతో గ్రామస్తులతో పాటు గ్రామ అధికారులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో చివరికి డాక్టర్ సహాయంతో కారును బయటకు తీశారు. వంతెన పూర్తిగా వర్షపు నీరుతో నిండడంతో జంగంపల్లి తలమడ్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.