ఆకివీడు సమీపాన ఉన్న ఉప్పుటేరు వంతెనపై నుంచి ఓ వృద్ధుడు దూకిన ఘటన చోటు చేసుకుంది. శ్రీరాంపురానికి చెందిన మజ్జి గాంధీ (64) శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన సైకిల్ ఆదివారం ఉదయం 11 గంటలకు వంతెనపై ఉండటాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఏఎస్సై సత్యనారాయణ, రైటర్ రమణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వలలు వేసి గాలింపు చర్యలు చేపట్టారు.