భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకి 5వ గని ఆవరణలో సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆదివారం ఉదయం 8 గంటలకు పాల్గొన్నట్లు ఎమ్మెల్యే గండ్ర, సీఎండీ బలరాం నాయక్ తెలిపారు. ముందుగా మొక్కలు నాటారు అనంతరం మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుందని కావున ప్రజలందరూ విధిగా మొక్కలు నాటుకోవాలని తద్వారా పర్యావరణాన్ని కాపాడుతూ ఆరోగ్యంగా ఉండవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు కార్మికులు పాల్గొన్నారు.