పింఛన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అర్హులైన ఏ ఒక్కరి పింఛన్ తొలగించడం లేదని రీ వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుందన్నారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో మీడియాకు మంత్రి స్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ నేతల మాదిరి తాము తప్పుడు పనులు చేయమన్నారు. అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు. కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనే దానికి నిదర్శనం పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పేనన్నారు.