ఉప్పలగుప్తం మండలం చిన్నగాడవిల్లి గ్రామపంచాయతీ పరిధి లంకశెట్టిపేటలో విషాదం నెలకొంది. గణపతి నిమజ్జనంలో డీజే సౌండ్కు డ్యాన్స్ చేస్తూ గుత్తుల ప్రసాద్ (37) అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.