కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదని వానకాలం వచ్చిన బిందె నీరు అందక మహిళలు అల్లాడుతున్నారని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు ధరూర్ మండలం మున్నూరు సోమారం గ్రామంలో తాగునీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతూ దూర ప్రాంతాల నుండి ఆటలలో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు కేసీఆర్ ప్రారంభించిన పథకాలను సైతం అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం చెందిందని విమర్శించారు