ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మార్కెట్ యార్డ్ పరిధిలోని బేల సబ్ మార్కెట్ యార్డులో తాత్కాలికంగా మూడు రోజుల పాటు కందుల కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ అధికారులు బుధవారం తెలిపారు. ఈనెల 26న మహాశివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలు, 28న అమావాస్య కారణంగా మూడు రోజులపాటు కొనుగోళ్ళను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మార్చ్ 1వ తేదీ నుండి యధావిధిగా కొనుగోలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అలాగే మార్కెట్ యార్డ్ కు రైతులు 2 గంటల లోపు మాత్రమే కందులు తీస్కొని రావలని, 2 గంటల తర్వాత లోడెడ్ బండ్లను మార్కెట్ లోనికి అనుమతించబడవని స్పష్టం చేశారు. కావున రైతులు సహకరించాలని కోరారు.