జిల్లా కేంద్రంలోని పద్మనాయక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా శుక్రవారం వినాయక పూజ అనంతరం సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు మహిళలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పద్మ నాయక సంక్షేమ మండలి మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమ అర్చనలతో పాటుగా పలు పూజా కార్యక్రమాలు వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే శుక్రవారం నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలను వేద పండితులు విషు శర్మ వేదమంత్రోచ్చరణలతో నిర్వహించగా, కుంకుమ పూజలో సుమారు 500 మంది మహిళలు భక్తి ప్రపత్తులతో పాల్గొని....