చౌదరిగుడా మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట తమకు యూరియా సరఫరా చేయాలని రైతులు సోమవారం మధ్యాహ్నం రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు స్పందించి వెంటనే తమకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని రైతుల డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.