రంగారెడ్డి జిల్లాలోని మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. గండిపేట మండలం వట్టినాగులపల్లి ,గండిపేట, కిస్మత్పూర్ గంధం కూడా మొయినాబాద్ లోని ,అజీజ్ నగర్ ,హిమాయత్ నగర్ కనకమామిడి చౌదరిగుడలోని తూంపల్లి ఎదిర సరూర్నగర్ లోని తుమ్మబౌలి మంచాలలోని లోయలపల్లి లో మీసేవ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.