మైలార్దేవ్పల్లి డివిజన్లో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాటపటిమా నేటి సమాజానికి స్ఫూర్తి అని అన్నారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ ప్రజల తెగువను పోరాటస్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కనిక చాకలి ఐలమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.