పార్టీ నాయకులంతా ఐకమత్యంగా ఉంటూ, పార్టీ ప్రతిష్ఠను నిలబెట్టే విధంగా వ్యవహరించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కోరారు. ప్రకాశం జిల్లా పార్లమెంట్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఒంగోలు నగరంలోని PAG ఫంక్షన్ హల్ నందు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఏవరికి ఇచ్చిన అందరం సమన్వయంతో కలిసికట్టుగా