తిరుపతి జిల్లా, వాకాడు వద్ద స్వర్ణముఖి బ్యారేజ్, వాకాడు ప్రభుత్వ ఆసుపత్రి భవన సముదాయాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గురువారం తనిఖీ చేశారు. ముందుగా స్వర్ణముఖి బ్యారేజీ ని సందర్శించి తుప్పు పట్టి ఉన్న బ్యారేజీ గేట్లను ఆయన పరిశీలించారు. బ్యారేజ్ గేట్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు . అనంతరం కలెక్టర్ వాకాడు గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి సముదాయాన్ని సందర్శించారు.