భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీ మాధవన్ బుధవారం నెల్లూరు పర్యటనకు విచ్చేస్తున్నారని...బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చి ఆయనను పర్యటన విజయవంతం చేయాలని శ్రీనివాసులు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో ఆయన మీడియాతో మాట్లాడారు.