రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు.రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం కావడానికి కారణం భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు సెంటర్ గా ఉండటమేనని ఆయన స్పష్టం చేశారు. “ఏ నాయకుడు, ఏ వ్యక్తి రాయచోటిని జిల్లా కేంద్రం చేయలేదు. రాయచోటికి అన్ని అర్హతలు ఉన్నందువల్లే అది జిల్లా కేంద్రం అయింది” అని మంత్రి తెలిపారు.నిన్న రాజంపేటలో జరిగిన మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాయచోటి నే జిల్లా కేంద్రంగా ఉంటుందని స్పష్టంచేశారని గుర్తు చేశారు.