మనోహరాబాద్ మండలం రామాయపల్లి శివారులోని ఇండూస్ మెడికేర్ కంపెనీలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో కార్మికులకు అవగాహన కార్యక్రమం కల్పించినట్లు ఎస్ఐ సుభాశ్ గౌడ్ తెలిపారు. తూప్రాన్ డివిజన్ షీ టీం ఆధ్వర్యంలో ఉద్యోగులకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణం అందించడానికి అవసరమైన అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కార్మికులకు సూచించారు. మహిళా ఉద్యోగులకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణం అందించడానికి అవసరమైన అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని వర్క్‌ప్లేస్, హరాస్మెంట్ నివారణ ఫిర్యాదు పరిష్కార విధానాలు, షీ టీమ్ పాత్ర అందించే సేవలు నివారణ చర్యల గురించి వివరించారు.