దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడగజాడల్లో అందరూ నడవాలని గుత్తి మున్సిపల్ చైర్ పర్సన్ బిందె వరలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ కుమార్ యాదవ్, పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. గుత్తిలో మంగళవారం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేశారన్నారు. రాజశేఖర్ రెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.