తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరు సెజ్ లోని పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. సోమవారం మేనకూరు సెజ్ లో పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ శ్రీ మాట్లాడుతూ మేనకూరు ఏర్పాటు చేయడం కోసం రైతులు త్యాగం చేసి తమ భూములను పరిశ్రమలకు అప్పగించారని అన్నారు. రైతు కుటుంబాలను నిరుద్యోగ యువతకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. సెజ్ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో సి ఎస్ ఆర్ నిధులతో ఆర్ ఓ ప్లాంట్ లు, పాఠశాల భవనాలు, రోడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించి నియోజకవర్గ